ఈ పుస్తకం ఒక ట్యుటోరియల్. ఇది క్రమంగా భాషను నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీరు ప్రాథమిక విషయాలను తెలుసుకున్న తర్వాత, మీకు ఇతర వనరులు అవసరం అవుతాయి.
ECMA-262 వివరణము జావాస్క్రిప్ట్ గురించి చాలా లోతైన, వివరణాత్మక మరియు అధికారిక సమాచారాన్ని కలిగి ఉంది. ఇది భాషను నిర్వచిస్తుంది.
కానీ అది లాంఛనప్రాయంగా ఉండటంతో, మొదట అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి భాషా వివరాల గురించి మీకు అత్యంత విశ్వసనీయమైన సమాచారం అవసరమైతే, వివరణమును సంప్రదించవచ్చు. కానీ ఇది రోజువారీ ఉపయోగం కోసం కాదు.
ప్రతి సంవత్సరం కొత్త వివరణపు కథనం విడుదల అవుతుంది. ఈ విడుదలల మధ్య, తాజా వివరణపు సంకల్పపత్రము https://tc39.es/ecma262/ వద్ద వుంటుంది.
"దాదాపు ప్రామాణికం" ("స్టేజ్ 3" అని పిలవబడే) సరి కొత్త లక్షణాల గురించి చదవడానికి, https://github.com/tc39/proposals వద్ద ప్రతిపాదనలను చూడచ్చు.
అలాగే, మీరు బ్రౌజర్ కోసం డెవలపింగ్ చేస్తుంటే, ట్యుటోరియల్ యొక్క రెండవ భాగంలో ఇతర వివరణములు ఉన్నాయి.
-
MDN (మొజిల్లా) జావాస్క్రిప్ట్ రిఫరెన్స్ ఉదాహరణలు మరియు ఇతర సమాచారంతో కూడిన నియమ సంపుటి. వ్యక్తిగత భాషా విధులు, పద్ధతులు మొదలైన వాటి గురించి లోతైన సమాచారం పొందడానిక ఇది చాలా తోడ్పడుతుందిి.
దీన్ని https://developer.mozilla.org/en-US/docs/Web/JavaScript/Reference లో చూడవచ్చు.
అయినప్పటికీ, దీనికి బదులుగా ఇంటర్నెట్ శోధనను ఉపయోగించడం మంచిది. ప్రశ్నలో "MDN [పదం]" ఉపయోగించండి, ఉదా.
parseInt
ఫంక్షన్ కోసం శోధించడానికి https://google.com/search?q=MDN+parseInt. -
MSDN - మైక్రోసాఫ్ట్ మాన్యువల్‌లో జావాస్క్రిప్ట్‌తో సహా చాలా సమాచారం వుంటుంది (తరచుగా దీనిని JScript అని పిలుస్తారు). ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు కోసం ప్రత్యేకంగా ఏదైనా అవసరమైతే, అక్కడికి వెళ్లండి: http://msdn.microsoft.com/.
అలాగే, మనం "RegExp MSDN" లేదా "RegExp MSDN jscript" వంటి పదబంధాలతో ఇంటర్నెట్ శోధనను ఉపయోగించవచ్చు.
జావాస్క్రిప్ట్ అభివృద్ధి చెందుతున్న భాష, క్రొత్త ఫీచర్లు క్రమ క్రమంగా జోడించబడతాయి.
బ్రౌజర్ ఆధారిత మరియు ఇతర ఇంజిన్‌లలో వాటి మద్దతును చూడటానికి:
- http://caniuse.com - ప్రతి ఫీచర్ యొక్క మద్దతు పట్టిక, ఉదా. ఆధునిక క్రిప్టోగ్రఫీ ఫంక్షన్లకు ఏ ఇంజన్లు మద్దతు ఇస్తాయో చూడటానికి: http://caniuse.com/#feat=cryptography.
- https://kangax.github.io/compat-table - భాషా లక్షణాలు మరియు వాటికి మద్దతు ఇచ్చే లేదా మద్దతు ఇవ్వని ఇంజిన్‌లతో కూడిన పట్టిక.
ఈ వనరులన్నీ నిజ జీవిత అభివృద్ధిలో ఉపయోగపడతాయి, ఎందుకంటే వాటిలో భాషా వివరాలు, వాటి మద్దతు మొదలైన వాటి గురించి విలువైన సమాచారం ఉంటుంది.
ఒక నిర్దిష్ట లక్షణం గురించి మీకు లోతైన సమాచారం అవసరమైనప్పుడు దయచేసి వాటిని (లేదా ఈ పేజీ) గుర్తుంచుకోండి.